బీజేపీ అంటే కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుందిః త‌రుణ్ చుగ్

అవినీతి, వంశ‌పారంప‌ర్య రాజ‌కీయాలే తెలంగాణ‌కు శాప‌మ‌ని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ అన్నారు.త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు కేసీఆర్ పాపాల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని తెలిపారు.

 Bjp Is Afraid Of Kcr Tarun Chugh Details, Bjp, Kcr, Tharun Chugg, Praja Sangrama-TeluguStop.com

అంబేద్క‌ర్ రాజ్యాంగంపై న‌మ్మ‌కం లేద‌ని, అందుకే కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని ర‌చించాల‌నుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.అధికారాన్ని కోల్పోతామ‌ని భ‌యం ఆయ‌న‌కు ప‌ట్టుకుంద‌ని, బీజేపీని చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

జ‌న‌గామ జిల్లాలో ప్ర‌జా సంగ్రామ యాత్ర‌పై జ‌రిగిన దాడి ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన దాడి అన్నారు.తెలంగాణలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని మండిప‌డ్డారు.అభివృద్ధి ప‌నులు చేస్తున్న చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని ఆరోపించారు.కేంద్రం ప్ర‌భుత్వంపై అస‌త్యాలు ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీనే విజ‌యం సాధిస్తుంద‌ని త‌రుణ్ చుగ్ ధీమా వ్య‌క్తం చేశారు.అదేవిధంగా ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.

అదే రోజు సాయంత్రం 4 గంటలకు మునుగోడులో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.ఆ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకుంటార‌ని వెల్ల‌డించారు.ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube