బీజేపీ అంటే కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుందిః త‌రుణ్ చుగ్

అవినీతి, వంశ‌పారంప‌ర్య రాజ‌కీయాలే తెలంగాణ‌కు శాప‌మ‌ని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ అన్నారు.

త్వ‌ర‌లోనే తెలంగాణ‌కు కేసీఆర్ పాపాల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని తెలిపారు.అంబేద్క‌ర్ రాజ్యాంగంపై న‌మ్మ‌కం లేద‌ని, అందుకే కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని ర‌చించాల‌నుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

అధికారాన్ని కోల్పోతామ‌ని భ‌యం ఆయ‌న‌కు ప‌ట్టుకుంద‌ని, బీజేపీని చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

జ‌న‌గామ జిల్లాలో ప్ర‌జా సంగ్రామ యాత్ర‌పై జ‌రిగిన దాడి ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన దాడి అన్నారు.

తెలంగాణలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని మండిప‌డ్డారు.అభివృద్ధి ప‌నులు చేస్తున్న చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని ఆరోపించారు.

కేంద్రం ప్ర‌భుత్వంపై అస‌త్యాలు ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీనే విజ‌యం సాధిస్తుంద‌ని త‌రుణ్ చుగ్ ధీమా వ్య‌క్తం చేశారు.

అదేవిధంగా ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.

అదే రోజు సాయంత్రం 4 గంటలకు మునుగోడులో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

ఆ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకుంటార‌ని వెల్ల‌డించారు.ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు.

కుంభమేళాలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చిన భక్తుడు.. నెటిజన్లు షాక్!