ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసింది. 5.18 లక్షల మంది విద్యార్థులు ఈ ట్యాబ్‌లను అందుకోగా, రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్‌ల కోసం రూ.688 కోట్లు పెట్టుబడి పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ట్యాబ్‌ల గురించి విప్లవాత్మకంగా పేర్కొంటూ విస్తృతంగా ప్రచారం చేసింది.
దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ.‘జగన్ అన్న ట్యాబ్స్’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోంది. “ట్యాబ్‌లు కేంద్ర ప్రభుత్వ సమగ్ర ‘శిక్షా అభియాన్’లో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందుతున్న మద్దతును ఇది తెలియజేస్తోంది’’ అని సోము వీర్రాజు అన్నారు.
ఆలస్యంగానైనా సోము చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సాధరణంగా కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్యలో భాగంగా రాష్ట్రాలకు మద్దతు ఉంటుంది.అయితే రాష్ట్రంలో ఎలాంటి వినూత్న కార్యక్రమం జరిగిన అందులో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 778 కోట్ల రూపాయల విలువైన ప్రీమియం కంటెంట్‌ని విద్యార్థులకు ఉచితంగా అందించడానికి AP ప్రభుత్వం BYJUని ఉపయోగించుకున్నంది, ఈ ట్యాబ్‌ల పంపిణీలో కేంద్రం వాటాను క్లెయిమ్ చేయడం సోమువి పస లేని వ్యాఖ్యలని పలువురు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌లో AP, BJP ప్రభుత్వాలతో పోలిస్తే BYJU యొక్క సహకారం ఎక్కువగా ఉంది.ఈ కార్యక్రమంలో రూపకల్పనలో ఈ సంస్ధ పాత్ర ఎక్కువగా ఉంది.
అయితే టాబ్ పంపిణిపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం అరంభ శూర్యం మాత్రమే అంటూ విమర్శిస్తున్నాయి.