సీఎం కేసీఆర్‌కు రాజకీయ ఉన్నంత ముందు చూపు మరెవరికీ లేదనే చెప్పాలి,.తన బలం సరిపోవట్లేదు అనుకుంటే తనకు అవసరమైన నేతలను దగ్గరకు తీసుకోవడం ఆ తర్వాత వారిని పక్కన పెట్టేయడంలో కేసీఆర్ ను మించిన నేత లేరనే చెప్పాలి.
ఆయన ఏ పథకం తీసుకొచ్చినా సరే దానిపై పెద్ద ఎత్తన అన్ని వర్గాల్లో చర్చ జరగే విధంగా చూస్తారు.తద్వారా తన పేరును ప్రజలు ఎల్లకాలం గుర్తంఉచుకోవాలని ఆయన కోరుకుంటారు.
ఇక తన ప్లాన్‌కు తగ్గట్టు వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఆయన మహా దిట్ట అనే చెప్పాలి.
ఇప్పటికే ఆయన తీసుకొచ్చిన రైతు బంధు, రైతుబీమా అలాగే గొర్రెల పంపిణీతో పాటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన స్కీమ్‌లను చూస్తుంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ స్కీమ్స్లను స్టార్ట్ చేసే క్రమంలో జనాల్లో వీటిపై విపరీతంగా చర్చ జరిగేలా చూశారు కేసీఆర్.ఇక ఇప్పుడు ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళిత బంధు స్కీమ్‌ను స్టార్ట్ చేసిన విషయం అంరికీ విదితమే.
కాగా ఇప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరిగేలా చేసేందకు కేసీఆర్ మరో ఎత్తుగడ వేస్తున్నారు.అయితే ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రముఖ లాయర్.హక్కుల కోసం విపరీతంగా కొట్లాడిన కీలక నేత అయిన దివంగత బొజ్జా తారకం పేరును ఇప్పుడు కేసీఆర్ వాడేస్తున్నారు.దళిత బంధు స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఆయన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యదర్శిగా తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.అంటే ఆయన దళిత ఆఫీసర్ కాబట్టి తీసుకుంటున్నానని చెప్తున్న కేసీఆర్ ఈ విధంగా దళితుల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు దళిత బంధుకు కూడా విపరీతమైన ప్రచారం వస్తుందని భావిస్తున్నారు.మొత్తానికి కేసీఆర్ నిర్ణయం రెండు రకాలుగా ప్రయోజనాలు తెస్తోందన్న మాట.