వైరల్: ఆ చిన్నారి వైద్యం కోసం ఒలంపిక్స్ విజేత ఏకంగా..?

డబ్బు కంటే మానవత్వమే విలువైనది అని పోలాండ్‌ కు చెందిన మారియా ఆండ్రెజిక్‌ నిరూపించారు.ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా.

ఇటీవల టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ త్రోయర్ ను 64.61 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ దక్కించుకున్నది ఈమె.అయితే మారియా ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.తనకు టోక్యో ఒలంపిక్స్ లో వచ్చిన సిల్వర్ మెడల్ ను డబ్బు కోసం వేలానికి పెట్టిందట.

ఏంటి ఇంత కష్టపడి సాధించిన మెడల్ ను డబ్బుల కోసం వేలం పాట పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా దానికి ఒక కారణం ఉంది.మారియా ఒక క్యాన్సర్ పేషంట్ అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.2018లో మారియాకు బోన్ క్యాన్సర్ వచ్చినట్లు పరీక్షల్లో తెలిసింది.కానీ మారియా ఏ మాత్రం అధైర్య పడకుండా క్యాన్సర్ అనే భూతాన్ని జయించి మరి ఒలంపిక్స్ లో పాల్గొని సిల్వర్ మెడల్ గెలిచింది.

అయితే మెడల్ గెలిచినా వారానికే దాన్ని అమ్మకానికి పెట్టడం వెనుక ఒక మంచి పని దాగి ఉంది.అసలు వివరాల్లోకి వెళితే ఆమె దేశానికి చెందిన అభం శుభం తెలియని ఒక 8 నెలల చిన్నారి గుండె సమస్యతో ఇబ్బంది పడుతుంది.

ఆ పాప హార్ట్ సర్జరీ కోసం తనకు వచ్చిన సిల్వర్ మెడల్ ను వేలం వేస్తున్నట్లు మారియా తన ఫేస్బుక్ ద్వారా తెలిపింది.మలీసా అనే 8 నెలల చిన్నారి తన సర్జరీ కోసం స్వదేశం నుండి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు.

Advertisement

ఆ చిన్నారి సర్జరీ నిమిత్తం డబ్బులు సహాయం చేసే క్రమంలో ఈ వేలం పాట గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా వారం రోజుల తర్వాత మెడల్‌కు 1.25 లక్షల డాలర్ల బిడ్ వరకు వచ్చాయట.అయితే ఈ బిడ్‌ ను పోలాండ్‌ కు చెందిన సూపర్‌ మార్కెట్ చెయిన్ జాబ్కా దాఖలు చేశారట.

ఆశ్చర్యం ఏంటంటే వేలంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నా గాని ఆ మెడల్ తీసుకోవడానికి ఆ సంస్థ ఒప్పుకోలేదు.మారియా గొప్ప మనసుకి ఫిదా అయిన ఆ సంస్థ డబ్బుతో పాటు తన సిల్వర్ మెడల్‌ ను కూడా తిరిగి తనకే ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

జాబ్కా కూడా ఈ విషయంలో మానవత్వాన్ని చాటుకున్నారు అనే చెప్పాలి.మారియా చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.క్యాన్సర్ తో బాధపడిన మారియాకు ప్రాణం విలువ ఏంటో తెలుసు.

కాబట్టే ఇప్పుడు ఈ చిన్నారి ప్రాణం కూడా పోవడం ఇష్టం లేక ఈ వేలం పెట్టినట్లు తెలుస్తుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు