కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు.వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరిపిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ను ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా పీసీసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతుందని సుమారు 9000 మంది ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటారని వెల్లడించారు.
ఇది బహిరంగ ఎన్నిక అని ఎవరైనా నామినేషన్లు దాఖలు చేయవచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అధ్యక్ష పదవి కోసం ప్రజాస్వామ్యంయుతంగా దేశంలో ఎన్నిక నిర్వహించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అంటున్నారు.ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున సెప్టెంబర్ నాలుగున ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖంగా ఉన్నారని సమాచారం.ఆయన అభ్యర్థిత్వం గురించి సి డబ్ల్యూ సి లోనూ చర్చకు రాలేదు.సోనియా గాంధీ కూడా అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశం లేనందున ప్రియాంక గాంధీ ఇక రంగంలోకి దిగుతారా.లేదంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ను గాంధీ కుటుంబం బరిలోకి దింపుతారా… అనే ప్రశ్నగా మారింది.
కుటుంబ పాలనను పెద్ద లోకంగా చూపుతూ సీనియర్లు కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోతున్న నేపథ్యంలో సమర్ధుడైన బయటి వ్యక్తిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే బాగుంటుందన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో వ్యక్తం మవుతుంది.తోలుబొమ్మలాంటి అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ మునుగాడ కష్టమని సిఎండబ్ల్యూసి సహా అన్ని పోస్టులకు ఎన్ని కలు నిర్వహించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ జవాన్ డిమాండ్ చేశారు.
అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు తమందరి ఏకైక ఎంపిక రాహుల్ గాంధీ అని సీనియర్ నేత సల్మాన్ అన్నారు.పార్టీ ఎన్నికలకు ఓటర్ల జాబితాపై అసమ్మతి నేత ఆనంద్ శర్మ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
డెలిగేట్ల జాబితా ఏపిసిసికి అందలేదని ఆరోపించారు.

అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ సెప్టెంబర్ 22న విడుదలవుతుంది.ఆ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.ఉపసంహరణకు గడువు అక్టోబర్ 8.ఎక్కువమంది పోటీ పడితే అక్టోబర్ 17న నిర్వహించి 19న ఫలితాలు ప్రకటిస్తారు.