భారత మెడికల్ విద్యార్ధులకు ఉక్రెయిన్ గుడ్ న్యూస్..!!!

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరిగిన భీకర యుద్దాన్ని ఇప్పటికి తలుచుకున్నా సరే ఒళ్ళు జలజరిస్తుంది.దూరం నుంచీ చూస్తున్న మనకే ఇలా ఉంటే అక్కడ ఉన్న వారికి అలాగే భారత్ నుంచీ మెడికల్ విద్యను అభ్యసించడానికి వెళ్లి ప్రత్యక్షంగా యుద్దాన్ని చూసిన మన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 Ukraine Good News For Indian Medical Students , Ukraine, Russia, Indian Medical-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్ కు మెడిసిన్ చదువు కోసం వలస వెళ్ళే విదార్దులలో అత్యదిక శాతం మంది భారత్ నుంచే వెళ్తుంటారు.అందుకే యుద్ధం కారణంగా తమ మెడిసిన్ విద్యను అర్థంతరంగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిన వారిలో భారతీయ విద్యార్ధులే అత్యదికంగా ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితులు ఓ మోస్తరుగా చక్కబడటంతో ఉక్రెయిన్ నుంచీ వారి వారి దేశాలకు వెళ్ళిపోయినా విద్యార్ధులకు అక్కడి వర్సిటీలు మళ్ళీ ఆహ్వానం పంపుతున్నాయి.సెప్టెంబర్ మొదటి రోజు నుంచీ క్లాసులు మొదలవుతాయని ఇక్కడకు రావాలని భావించే వారు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది అయితే క్లాసులకు హాజరయ్యే విద్యార్ధులకు ఉక్రెయిన్ మూడు ఆప్షన్ లు ఇచ్చింది అదేంటంటే.

ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని సాహసం చేసి అక్కడకి వెళ్లి చదువుకోవడం, లేదా ఆన్లైన్ క్లాసులకు హాజరవ్వడం, అదీ కాదంటే.

ఇతర దేశాలలోని వర్సిటీలలో తమ చదువును కొనసాగించడం.

ఈ మేరకు యూరప్ కి చెందిన జార్జియా , పోలెండ్ వర్సిటీలతో ఉక్రెయిన్ వర్సిటీలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయట.ఈ విషయాన్ని భారతీయ విద్యార్ధులకు తెలియజేయాలంటూ జాతీయ వైద్య మండలి, అలాగే ఉక్రెయిన్ లోని రాయబార కార్యాలయానికి లేఖలు రాశామని కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ స్పందించ లేదని అందుకే విద్యార్ధులకు తెలిసేలా సమాచారాన్ని పంపుతున్నాయి అక్కడి వర్సిటీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube