సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అగ్రతారగా దక్షిణాది సినీ ఇండస్ట్రీనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అవకాశాలను అందుకుంటు ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సమంతకు తన వ్యక్తిగత విషయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బిగ్ బాయ్స్ క్లబ్’ నెపోటిజం పై మీ ఆలోచన ఏంటీ ? అని కరణ్ సమంతను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమంత ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పింది.ఆమె మాట్లాడుతూ ఒక ఆపిల్ కి మరొక ఆపిల్ కు చాలా భిన్నంగా ఉంటుంది ఇండస్ట్రీలో కూడా నేపో పిల్లలు నాన్ నెపో పిల్లల మధ్య ఎన్నో బేధాలు ఉన్నప్పటికీ వారి కంటూ సొంత ఆలోచనలు సొంత ప్రతిభ ఉంటుందని ఈమె తెలిపారు.
ఒక తండ్రి కోచ్ అయినప్పుడు తన పిల్లవాడు గేమ్ ఆడుతుంటే పక్కనుండి చూస్తారే తప్ప తను గెలవడం కోసం ఏమీ చేయలేరు.తాను గెలవాలన్న మంచి పేరు సంపాదించుకోవాలన్నా తానే కష్టపడాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.
ఇండస్ట్రీలో కూడా అంతే వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారి ప్రతిభ, అదృష్టంతోనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు.అయితే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాలాంటి వాళ్ళు సినిమాలు కనక డిజాస్టర్ అయితే కేవలం మా అమ్మ నాన్న,నా సోదరులకు మాత్రమే తెలుస్తుంది.అదే వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే వారి ఫెయిల్యూర్ దేశం మొత్తం తెలిసిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున వారిని ట్రోల్స్ చేస్తూ ఉంటారనీ సమంత నెపోటిజం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.