మహేష్ తో కమల్ హాసన్..!

టైటిల్ చూసి ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ తో లోకనాయకుడు కమల్ హాసన్ మూవీ అనుకుని ఉండొచ్చు.కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు.

 Kamal Hassan Work With Mahesh , Director, Kamal Hassan,kollywood,mahesh, Mahesh-TeluguStop.com

విక్రం సక్సెస్ తో సూపర్ ఫాం లో ఉన్న కమల్ హాసన్ ఇదివరకు డిస్కషన్స్ లో ఉన్న సినిమాలన్నిటినీ లైన్ లోకి తెస్తున్నాడు.ఇప్పటికే ఇండియన్ 2, శభాష్ నాయుడు సినిమాలని మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్తున్న కమల్ హాసన్ లేటెస్ట్ గా మళయాళ ఎడిటర్ కమ్ డైరక్టర్ మహేష్ నారాయణన్ తో సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

మళయాళంలో ఎడిటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన మహేష్ నారాయణన్ డైరక్టర్ గా మారి టేకాఫ్ అనే సినిమా చేశారు.ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాకుండా అవార్డులను సైతం దక్కించుకుంది.

ఆ తర్వాత డైరక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్న మహేష్ కమల్ హాసన్ కి ఓ కథ వినిపించారట.కథ నచ్చడంతో వెంటనే మహేష్ కి ఓకే చెప్పారట కమల్ హాసన్.

Telugu Kamal Hassan, Kollywood, Mahesh, Mahesh Yanan, Vikram, Viswaroopam-Movie

ఎడిటర్ డైరక్టర్ అయితే సినిమా వేరే రేంజ్ లో ఉంటుంది.అంతేకాదు అరియిప్పు సినిమాను ప్రొడ్యూసింగ్ కూడా చేశారు మహేష్.మొత్తానికి మరో టాలెంటెడ్ డైరక్టర్ తో కమల్ హాసన్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు.ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.విక్రం కు ముందు కమల్ హాసన్ పని ఇక అయిపోయింది అన్న వారందరికి గూబ అదిరిపోయేలా తన సత్తా చాటాడు కమల్ హాసన్.తన కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా విక్రం 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

 విక్రం ఈ రేంజ్ హిట్ అవుతుందని కమల్ హాసన్ కూడా ఊహించలేదని చెప్పొచ్చు.  లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రం మూవీలో ఫాహఫ్ ఫాజిల్, వినయ్ సేతుపతి కూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube