ఆ నేతలపై టీడీపీ అధిష్టానం ఫోకస్..

జగన్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా టీడీపీ నేతలు దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా వెనుకబడ్డారు.ప్రజలు టీడీపీవైపు చూస్తుంటే.

 Tdp Focus On Group Politics Among Ap Leaders Details, Tdp , Tdp Group Politics ,-TeluguStop.com

లీడర్లు మాత్రం కుమ్ములాడుకుంటూ పార్టీని మరోసారి ఓటమి పాలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు.గత మూడేళ్లలో టీడీపీ ఆద్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్దగా పోరాడింది ఏమీ లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.

వైసీపీ వర్గీయుల ఆగడాలపైగానీ.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డినిగానీ టీడీపీ ఇంచార్జ్ మీనాక్షినాయుడు ఏనాడూ విమర్శించిందీ లేదంటున్నారు.

టీడీపీ కార్యకర్తలకు నేనున్నానంటూ దైర్యం చెప్పే లీడర్లు కరువయ్యారని వారు వాపోతున్నారు.మీనాక్షినాయుడు తీరుపై తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టితోపాటు రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెంనాయుడుకు కార్యకర్తలు ఫిర్యాదులు కూడా చేశారు.

సొంత పార్టీలోనే మీనాక్షి వర్గం.మహిళా నేత గుడిసె కిష్టమ్మ వర్గం.మదిలి భాస్కర్ రెడ్డి వర్గం, పెద్ద హరివనం దేవేంద్రప్ప వర్గం.ముస్లిం మైనార్టీల నేత రవూఫ్ వర్గం అంటూ ఎవరికివారు విడిపోయారు.

వీరంతా ఒకప్పుడు పార్టీ కోసం కలసి పని చేసిన వారేనన్నది గమనార్హం.ఇప్పుడు వారంతా పార్టీలోనే ఉన్నా విబేధాలను పరిష్కరించుకోలేక పార్టీని బలహీనపరుస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించనున్నదోనని ఎవరికివారు విడిపోయారు.ప్రజల్లో టీడీపీ పట్ల ఆదరణ ఉన్నా… లీడర్ల కుమ్ములాటలతో చేజేతులా పార్టీని ముంచేసుకుంటున్న దుస్థితి.

ఈ కుమ్ములాటల వల్లే మున్సిపల్.జడ్పీటీసీ.ఎంపీటీసి.పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాలను టీడీపీ మూటకట్టుకుంది….సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి కొందరు ఆసక్తి చూపిస్తున్నా.

Telugu Ap, Atchennaidu, Chandrababu, Cm Jagan, Cmjagan, Tdp, Tdpincharge-Politic

ముఖ్యమైన లీడర్లే వారిని అడ్డుకుంటూ నిరుత్సాహపరుస్తున్నారని క్యాడర్ మధ్యచర్చ సాగుతోంది… ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇటీవలే సీఎం జగన్ విద్యాకానుక కార్యక్రమాన్ని ఆదోనిలో నిర్వహించారు.కాగా ఆ కార్యక్రమానికి జనం రాకపోతే పరువు పోతుందని భావించి పొదుపు మహిళలు, స్కూల్ పిల్లలను భారీగా తరలించి.

సభకు వచ్చిన వారు బయటకు వెళ్లకుండా క్యాబిన్లలో ఎక్కడికక్కడ బంధించేసి .సభ భారీ సక్సెస్ అనిపించుకున్నారు.ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి పార్టీని చక్క దిద్దకపోతే.రానున్న ఎన్నికల్లో తిరిగి ఓటమి తప్పదని సొంత పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube