టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే తాజాగా చిత్రబృందం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
విజయవాడలోని రాజ్ యువారాజ్ థియేటర్స్‌లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో గోపీచంద్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలియజేశారు.
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది.ఈ క్రమంలోనే గోపీచంద్ సైతం తనకు మల్టీస్టారర్ చిత్రంలో నటించాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టడమేకాకుండా ప్రభాస్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించాలని ఉందనే విషయాన్ని బయటపెట్టారు.

గోపీచంద్ ప్రభాస్ ఇదివరకు వర్షం సినిమాలో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ప్రభాస్ హీరోగా నటించగా, గోపీచంద్ విలన్ పాత్రలో నటించారు.ఇకపోతే తాజాగా ఆయన నటించిన పక్కా కమర్షియల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా సందడి చేశారు.
ఈ సినిమాలో వీరిద్దరు లాయర్ పాత్రలో కనిపించనున్నారు.ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ట్రైలర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.