నైంటీస్ లో టీనేజ్ లో ఉన్న వారికి అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన చేసిన ప్రేమదేశం సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్.
లవర్ బోయ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్ తమిళంలోనే కాదు తెలుగులో కూడా వరుస సినిమాలు చేశారు.అయితే కెరియర్ లో స్టార్ స్టేటస్ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.
హీరోగానే కాదు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చిన అబ్బాస్ తెలుగులో చివరగా 2014లో అలా జరిగింది ఒకరోజు సినిమా చేశాడు.ఆ తర్వాత 2015లో మళయాళంలో ఒక సినిమా చేశాడు.
దాదాపు 7 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్నాడు అబాస్.అడపాదడపా యాడ్స్ లో కనిపించారు అబ్బాస్.ఇదిలాఉంటే ఈ హీరోని మళ్లీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారట.అది కూడా తెలుగు సినిమాలో అబ్బాస్ రీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.
మ్యాచో హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో అబ్బాస్ నటిస్తారని టాక్.అబ్బాస్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడని అంటున్నారు.
రీసెంట్ గా అబ్బాస్ ఏ ప్రాజెక్ట్ చేయలేదు.ఈ సినిమా క్లిక్ అయితే మాత్రం అతనికి తప్పకుండా మళ్లీ వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.