ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవికి ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ అనే బిరుదును ఆమె అభిమానులు ఇచ్చారు.
అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.సాధారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతర హీరోల గురించి తరచు విమర్శలు చేస్తూ ఉంటారు.
తమ హీరో గురించి చిన్న మాట అన్నా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు.అలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది స్టార్ హీరోలను పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేసి ఆడుకున్నారు.
ఇదిలా ఉండగా తాజగా వీరు సాయి పల్లవి మీద ఫోకస్ చేశారు.ఇటీవల సాయి పల్లవిని ఆమె అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటూ పిలవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.
పవర్ స్టార్ పేరు కేవలం మా హీరోకే ఉండాలి.అందరు మా హీరోనే పవర్ స్టార్ అని పిలవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సాయి పల్లవిని టార్గెట్ చేసి ఆమె మీద విమర్శలు చేయటానికి ఒక సరైన సందర్బం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.పవర్ స్టార్ అనే పేరుకు సాయి పల్లవి అర్హురాలు కాదు.పవర్ స్టార్ సినిమా అంటే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టాలి.
కానీ విరాట పర్వం సినిమా విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు రాబట్టలేక పోతుంది.అదే పవన్ కళ్యాణ్ సినిమా అయితే ప్లాప్ అయినా కూడా భారీ వసూళ్లు చేసేది.
అందువల్ల సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ పిలవటం ఇప్పటికైనా ఆపేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.