మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.దాదాపు 35 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.ఈయన మొన్నటి వరకు విశ్రాంతి తీసుకుంటున్నాడు.అయితే సాయి తేజ్ ఇటీవలే విశ్రాంతి పూర్తి చేసుకుని తన కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.SDT15 స్టార్ట్ అయ్యి వేగంగా పూర్తి కూడా చేసుకుంటుంది.థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.
ఈ సినిమాకు శ్రీ వెంకటేస్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.

‘SDT15’ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా చేస్తుండగానే మరొక సినిమాను అనౌన్స్ చేసాడు సాయి తేజ్. ఈ రోజు సాయి తేజ్ 16వ సినిమాను అఫిషియల్ గా ప్రకటించారు.డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

సంపత్ నంది చివరిసారిగా గోపీచంద్ సీటిమార్ సినిమాకు పని చేసాడు.ఈ సినిమా తర్వాత ఈయన సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయనున్నాడు.మరి కథతో మెప్పించి ఈ మెగా హీరోను లైన్లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తునాన్రు.త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.