బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.ఆమె హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే కామినేని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి.
తాజాగా ఆమె షూటింగ్ లో ఉండగానే హార్ట్ బీట్ పెరిగి చాలా ఇబ్బంది పడిందట.దాంతో వెంటనే కామినేని ఆసుపత్రిలో జాయిన్ చేశారు అంటూ సమాచారం అందుతోంది.
పెద్ద ఎత్తున అభిమానులు మరియు ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు.
కామినేని నుండి కొద్ది సమయంలోనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రాజెక్ట్ కే షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగిందని.ఆమె షూటింగ్ లో ఉన్న సమయంలో గుండెకు సంబంధించిన ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది.
గుండె కు సంబంధించి చాలా రోజులుగా దీపిక పదుకునే ఇబ్బందికి గురి అవుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం తో పాటు అప్పుడప్పుడు ఆమె బీపీ లెవల్స్ కూడా మారుతూ ఉంటాయట.
దాంతో ఆమె కు తాజాగా గుండె కొట్టుకోవడం ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది.

షూటింగ్ మద్యలో ఆపేసి యూనిట్ సభ్యులు దీపిక పదుకునే ను ఆసుపత్రికి తీసుకు రావడం జరిగిందని.ప్రస్తుతం ఆమె నూరు శాతం ఆరోగ్యంగా ఉన్నారంటూ యూనిట్ సభ్యులు అనఫిషియల్ గా క్లారిటీ ఇచ్చారు.ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే లో నటించడంతో పాటు పలు సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూ బాలీవుడ్ లో నెం.1 హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.అలాంటి దీపిక పదుకునేకు అనారోగ్య సమస్య అంటే ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం అంటూ నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.