వంశీకి కష్టాలే కష్టాలు ! లైన్ లోకి వచ్చిన వెంకట్రావ్ ?

టిడిపి నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.అధికారికంగా టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వంశీ వైసీపీకి అనుబంధ సభ్యుడిగా అనధికారికంగా కొనసాగుతున్నారు.

 Gannavaram Mla Vamsi Is In Trouble With Yarlagadda Venkatrao Being Active , Vall-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మంట పుట్టిస్తున్నారు.వంశీ అస్త్రాన్ని ఉపయోగించి టిడిపిపై విమర్శలు చేస్తూ వైసిపి రాజకీయంగా లబ్ధి పొందుతుంది.

దీంతో వంశీకి జగన్ ఎక్కువగానే ప్రాధాన్యం ఇస్తున్నారు.కానీ గన్నవరం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది.

వంశీ టిడిపిలో ఉన్న సమయంలో వైసిపి నాయకులను ఇబ్బందులు పెట్టడం, వారిపై కేసులు నమోదు చేయడం వంటివి ఇప్పుడు వంశీకి ఇబ్బందికరంగా మారాయి.వంశీతో కలిసి పనిచేసేందుకు వైసీపీ నాయకులు ఇష్టపడకపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వైసిపి అధిష్టానానికి తలనొప్పులు తీసుకొస్తున్నాయి.ముఖ్యంగా సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు వర్గంతో తల నొప్పులు వచ్చి పడుతున్నాయి.

2024 ఎన్నికల్లో టిక్కెట్ తమదేనని రామచంద్రరావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ , వంశీ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు .తరచుగా దుట్టా – వంశీ వర్గాల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉండడం తో వైసిపి సైతం అనేక సార్లు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా పోయింది.వీరి మధ్య వివాదం ఇలా కొనసాగుతుండగానే, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు సైతం రంగంలోకి దిగారు.

గత ఆరు నెలలుగా వెంకట్రావు నియోజకవర్గం అందుబాటులో లేరు.అమెరికాలో వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లడంతో గన్నవరం నియోజకవర్గంలో వంశీ – రామచంద్ర వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది.

Telugu Gannavaram Mla, Telugudesam, Ysrcp-Politics

అయితే ఇప్పుడు వెంకట్రావు మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టడంతో ఈ నియోజకవర్గంలో మూడు గ్రూపులు గా పార్టీ తయారయింది.ఇక ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి ఎర్రగడ్డ వెంకట్రావు కూడా స్పందించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటీ చేశానని, వంశీ ని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించానని, ప్రతిసారి నేను అధిష్టానంతో పోరాటం చేయలేనని వెంకట్రావు తాజాగా వ్యాఖ్యానించారు.తాను వ్యక్తిగత పనిమీద ఆరు నెలలుగా అమెరికా లో ఉన్నానని … ఆ సమయంలో తాను తెలుగుదేశం పార్టీ తో టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం చేశారని, తాను వైసీపీలోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.

తాను రాజకీయం చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తానని, జగన్ తనను పార్టీలోకి తీసుకు వచ్చారని, ఆయన వెంటే తాను నడుస్తానని వెంకటరావు క్లారిటీ ఇచ్చారు.నాకు ఏదైనా పదవి ఇస్తే పని చేసి చూపిస్తానని, ఇవ్వకుండా ఎలా పని చేసేది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు దుట్టా రామచంద్ర వర్గంతో తలపడుతున్న వంశీ , ఇప్పుడు వెంకటరావు వర్గాన్ని ఎదుర్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube