హాట్రిక్ ఛాన్సులు.. హ్యాట్రిక్ హిట్ లు.. మైత్రి మూవీ మేకర్స్ సూపర్ ప్లాన్?

ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు విడుదల అవుతున్న కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి.బాక్సాఫీసు వద్ద సత్తాచాటి మంచి వసూళ్లతో విజయం సాధిస్తూ ఉన్నాయి.

 Maithri Movie Makers Upcomingt Movies Maithri Movie Makers, Tollywood , Anta Su-TeluguStop.com

ఇక ఇలా బాక్సాఫీస్వద్ద సత్తా చాటుతున్న సినిమాలలో చాలా మటుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణసంస్థ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.సినిమాను ఎలా షేర్ చేయాలి ప్రేక్షకులకు ఎలా దగ్గర చేయాలి అన్న విషయాన్ని బాగా కనిపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇక తమ నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమా హిట్టు కొట్టే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే చేసిన దర్శకులు తోనే మరో సినిమా చేస్తూ ఇక దర్శకులకు హాట్రిక్ హిట్స్ అందిస్తూ ఉండడం గమనార్హం.ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రేపు అంటే సుందరానికి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

వికాస్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమా సినిమా ట్రైలర్ చూస్తే పక్కా హిట్ అన్నది తెలుస్తుంది.

అయితే వివేక్ ఆత్రేయ కు ఇది మైత్రి మూవీ మేకర్స్ తో మూడవ సినిమా కావడం గమనార్హం.ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ ఇక ఇప్పుడు అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Telugu Maithri Makers, Madilo, Mirchi, Nagachaitanya, Nani, Nazriya, Premam, Sri

ఇక అంతకు ముందు ఇక కొరటాల శివ కూడా ఈ నిర్మాణసంస్థలో హ్యాట్రిక్ కొట్టడం గమనార్హం.మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాలతో శ్రీమంతుడు సినిమాను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.ఆ తర్వాత జనతా గ్యారేజ్ కూడా చేసి కొరటాలకు ఈ బ్యానర్ లో హ్యాట్రిక్ ఇచ్చేసింది. కార్తికేయ, ప్రేమమ్ లాంటి హిట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే కొట్టిన చందు మొండేటి ఇక సవ్యసాచి సినిమాతో ఈ బ్యానర్ లోనే హిట్ కొట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరి ఇప్పుడు వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి సినిమాతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube