స్మార్ట్ ఫోన్ లో సరదాగా అలా చేయగా ఏకంగా 36 లక్షలు గోవిందా గోవిందా..!!

ప్రస్తుత కాలం అంతా స్మార్ట్ ఫోన్ మీదనే నడుస్తుంది.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం చుట్టేయొచ్చు.

 36 Lakhs Gon For Doing So While Having Fun On A Smart Phone, Smart Phine, Playi-TeluguStop.com

ఏది కావాలంటే అది మనం ఉన్నచోటకు రప్పించుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ వలన మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కానీ స్మార్ట్ ఫోన్ అనేది మనిషికి ఒక వ్యసనంలాగా మారిపోయింది.

చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఫోన్ తోనే జీవితాన్ని గడిపేస్తున్నారు.అలాగే పిల్లలు కూడా ఫోన్లో ఉండే ఆటలకు బాగా అలవాటు పడిపోతున్నారు.

ఎంచక్కా పుస్తకాలు చదువుకునే పిల్లలు ఎంతసేపు ఫోన్లో పబ్జీ గేమ్,లూడో, ఫ్రీ ఫైర్ గేమ్స్‌ లాంటి ఆటలకు అలవాటు పడిపోతున్నారు.ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా లేదంటే అన్నం తినను అని తల్లి తండ్రులను బెదిరించే పరిస్థితి వచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఘటన గురించి తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.ఒక బాలుడు సెల్‌ఫోన్‌ సరదా వలన భారీ నష్టాన్ని చవిచూశారు అతని కుటుంబ సభ్యులు.

వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన 16 ఏళ్ల బాలుడు తన తాతయ్య దగ్గర స్మార్ట్ ఫోన్ తీసుకొని అందులో ఫ్రీ ఫైర్ గేమింగ్‌ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి గేమ్‌ ఆడాడు.ముందుగా తాతయ్య ఫోన్‌లో ఉన్న తల్లి అకౌంట్ నుంచి 1500 రూపాయలతో గేమ్ లోని లెవెల్స్ కొనుగోళ్లు జరపడం స్టార్ట్ చేసాడు.

అలా మొదట 1500 రూపాయలతో ఆట మొదలుపెట్టిన బాలుడు ఆటకు బానిస అయిపోయి ఆ తర్వాత 10వేలు పెట్టాడు.ఇంకా ఆటపై ఆసక్తి తగ్గని బాలుడు అక్కడితో ఆగకుండా తాతయ్యకు చెందిన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌లోని 9లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వరకు ఆట ఆడుతూనే వచ్చాడు.

ఇలా తాతయ్య ఫోన్ తీసుకుని ఆ బాలుడు ఫ్రీ ఫైర్ గేమింగ్‌ ఆడడం ఇంట్లో ఎవరూ గమనించలేదు.తాతయ్య బ్యాంక్‌ లో డబ్బులు అయిపోయాక ఆ ఖాతాను వదిలేసి ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌లోని రెండు లక్షలు మరోసారి లక్ష అరవై వేలతో గేమ్ ఆడాడు.1500 రూపాయలో గేమ్‌ స్టార్ట్ చేసిన బాలుడు మళ్ళీ 27లక్షలు గేమ్‌లో పోగొట్టాడు.

ఆ బాలుడు తల్లి డబ్బులు అవసరం అయ్యి బ్యాంక్‌కి వెళ్ళాకాగాని అసలు నిజం తెలియలేదు.

బ్యాంక్ అధికారులు స్టేట్‌మెంట్‌ తీసిచూపడంతో ఆ తల్లి ఒక్కసారిగా షాక్ అయింది వెంటనే బాధితురాలు సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా మొత్తంగా ఆన్‌లైన్‌ యాప్‌ గేమ్‌ వల్ల 36లక్షలు నష్టపోయినట్లుగా గుర్తించారు.

ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ డబ్బు పోగొట్టుకున్న బాధిత మహిళ మరెవరో కాదు ఒక పోలీస్‌ ఉన్నతాధికారి భార్య.తన భర్త మరణించడంతో వచ్చిన బెనిఫిట్‌ డబ్బులను తమ బ్యాంక్‌ ఖాతాలో ఉంచితే కొడుకు సరదా కాస్త ఆ డబ్బులను పోయేలా చేసింది.

తన భర్త కష్టార్జితంగా భావిస్తున్న డబ్బును తిరిగి తమకు వచ్చేలా చేయమని అధికారులను బాధిత మహిళ వేడుకుంది.ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube