రవితేజ-శరత్ మండవ -సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' నుండి సెకండ్ సింగిల్ 'సొట్టల బుగ్గల్లో' పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమౌతుంది.ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

 Mass Maharaja Ravi Teja, Ramarao On Duty Second Single Sottala Buggallo Out , R-TeluguStop.com

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, దివ్యాంశ కౌశిక్‌లపై చిత్రీకరించిన సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు.

ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది.

పాటలో విజువల్స్ లావిష్ గా వున్నాయి.రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్ స్టప్స్ కూడా అభిమానులని అలరించాయి.

కళ్యాణ్ చక్రవర్తి చక్కని సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంకర్ లవ్లీగా ఈ పాటని ఆలపించారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ‘ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube