ఇంద్రాని చిత్రం నుండి న‌టి గ‌రిమ కౌశ‌ల్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌*

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం `ఇంద్రాని`నుండి నటి గరిమా కౌశల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌.ఈ సంద‌ర్భంగా “ఈ చిత్రంలో గరిమా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఇంద్రాణి కథ మొత్తం ఆమె పాత్ర‌ చుట్టూనే తిరుగుతుందని పేర్కొన్నారు.

 Presenting The First Look Of Garima Kaushal From The World Of Indrani , Yaanea B-TeluguStop.com

ఇంద్రాణి ప్రధాన కథాంశం గురించి సంగీత దర్శకుడు సాయికార్తీక్‌గారితో చర్చిస్తున్నప్పుడు, సాయికార్తీక్‌కి కథ బాగా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నాడు.సేవ్ ద గ‌ర్ల్ టు సేవ్ ద వ‌ర‌ల్డ్‌(Save the Girl to Save the World) అనే క్యాప్ష‌న్ ఇచ్చి ఈ శీర్షిక ఆధారంగా ప్రత్యేక టైటిల్ సీక్వెన్స్ పాట కంపోజ్ చేస్తానని హామీ ఇచ్చార‌ని తెలిపారు.

సైన్స్ ఫిక్షన్ కథాంశం, కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డ్రామా, డ్యాన్స్ నంబర్‌ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని స‌మ‌పాళ్ల‌లో కూడిన మొట్ట‌మొద‌టి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా ఇంద్రాని నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంది.ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 27 అక్టోబ‌రు 2022న విడుద‌ల చేయ‌నున్నారు.

న‌టీన‌టులు: యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌, గ‌రీమా కౌశ‌ల్‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube