పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ బాబు నేను విన్నాను నేను ఉన్నాను డైలాగ్ చెప్పగా ఈ డైలాగ్ జగన్ పై అభిమానంతో చెప్పారా లేక సెటైరికల్ గా చెప్పారా అనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే వైరల్ అవుతున్న కామెంట్ల గురించి దర్శకుడు పరశురామ్ స్పందించి వివరణ ఇచ్చారు.
తాను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానినని పరశురామ్ అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తే హీరో అనే భావన కలుగుతుందని ఎవరైనా ఏదైనా సమస్యతో ఆయన దగ్గరకు వెళితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేను విన్నాను.నేను ఉన్నాను అని చెప్పేవారని మహేష్ బాబు సినిమాలో ఆ డైలాగ్ ను చెప్పే సమయంలో చాలా ఎంజాయ్ చేశారని ఆయన అన్నారు.
గీతా గోవిందం సినిమా తనకు గొప్ప ఎనర్జీని ఇచ్చిందని వ్యక్తి గురించి, వ్యవస్థ గురించి ప్రశ్నించే సన్నివేశాలు ఈ సినిమాలో లేవని ఆయన వెల్లడించారు.దేవుడి దయ వల్లే మహేష్ బాబుతో సినిమా తీయగలిగానని ఆయన చెప్పుకొచ్చారు.
బన్నీకి తాను సర్కారు వారి పాట కథ చెప్పానని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు.ఒక కామన్ మేన్ బిహేవియర్ ఈ సినిమాలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.