తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.74 ఏళ్ల వయసులో ఆయన నిరంతరం పార్టీ కోసం కష్టపడాల్సిన పరిస్థితి.తాను పట్టించుకోకపోతే పార్టీ పరిస్థితి అధోగతి అవుతుందనే విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే ఒకవైపు తన కుమారుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే, ఇంకోవైపు క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులు వరకు అందరిలోనూ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని బాబు కలిగిస్తున్నారు.
అయినా. చాలామంది నాయకులు ఇంకా వైసీపీ ప్రభుత్వం పై పోరాడే విషయంలో కానీ, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో కానీ తమ వంతు ప్రయత్నాలు చేసే విషయంలో కానీ మౌనంగా ఉండిపోవడం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగిస్తోంది.
ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులు ఇదే వైఖరితో ఉండడం మంట పుట్టిస్తోంది.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది యాక్టిివ్ గా ఉండకపోవడాన్ని బాబు సీరియస్ గానే తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వ్యవహారశైలిపై బాబు సెటైర్లు వేశారు.సీనియారిటీ ఉన్న నేతలు ప్రజలతో ఓట్లు వేయించ లేకపోతే ఎలా అని ? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకుండా కూర్చుంటే ఏం ప్రయోజనం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.సీనియారిటీ ఉన్న నేతలు ఓటు వేయకపోతే అటువంటి నాయకులు ఉండి కూడా పార్టీకి ప్రయోజనం ఏమిటని బాబు ప్రశ్నించారు.పార్టీ కోసం కష్టపడి పని చేయకుండా, తమకు సముచిత స్థానం కల్పించాలి అంటూ… పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఎలా అని బాబు ప్రశ్నించారు.
ఇలా అయితే మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికే టీడీపీని వీడి ఎంతో మంది నేతలు వైసీపీ వంటి పార్టీలలో చేరిపోయారు .
ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరికొంతమంది టిడిపి కి దూరం అయితే పార్టీ అధికారానికి మళ్లీ దూరం అవుతుందనే భయం చంద్రబాబులో ఉంది. అందుకే సీనియర్ నాయకులను యాక్తీవ్ చేసే విధంగా ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.