మున్సిపల్ కార్మికుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పై లోకేష్ సీరియస్..!!

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.దాదాపు అయిదు నెలలపాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల జీతాలను ప్రభుత్వం ఇవ్వకపోవడం తో కార్మికులు నిరసనలు ఆందోళనలు చేసిన క్రమంలో వాలని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.దీంతో వైసీపీ ప్రభుత్వం కార్మికులని అరెస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో లోకేష్ పోస్ట్ చేయడం జరిగింది.‘మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం వైఎస్ జ‌గ‌న్ మూర్ఖత్వానికి పరాకాష్ఠ.దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్యజీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి.

 Lokesh Serious On Ycp Governament Lokesh, Ycp , Tdp , Ysr Cp , Ys Jagn , Raja Re-TeluguStop.com

అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా? అని లోకేశ్ మండిపడ్డారు న్యాయబద్ధంగా రావాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలని నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య‌ కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు’ అని కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.‘నాలుగు రోజులు రిలే నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోకపోగా, కనీసం వారి సమస్య గురించి వినడానికి కూడా ఉన్నతాధికారులకు మనస్సు రాలేదు.వెంటనే మునిసిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలి.అరెస్ట్ చేసిన కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలి’ అని లోకేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube