పక్క రాష్ట్రపు గుణపాఠాన్ని జగన్ పట్టించుకుంటారా?

ఎంతగా రాష్ట్రాలుగా విడిపోయినా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న తెలుగు ప్రజల ఆలోచనా విదానం ఎన్నికలకు సంబంధించిన అంతవరకు కొంత ఒకే రకంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు .దాంతో ఇప్పుడు తెలంగాణ( Telangana )లో జరిగిన రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీని కొంత కలవర పరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Will Jagan Heed The Lesson Of The Neighboring State , Telangana State, Andhr-TeluguStop.com

ముఖ్యంగా బారతీయ రాష్ట్ర సమితి ఓటమి పై ఇప్పటికే అనేకమంది అనేక వ్యాఖ్యానాలు చేసినా కూడా అన్నిటిలోకి అతి ప్రధానమైనది అవినీతి ఆరోపణలు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగే కొనసాగించడమే అన్నది ఏకగ్రీవంగా వచ్చిన విశ్లేషణగా కనిపిస్తుంది.

అనేక చోట్ల విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన నాయకులను కేసీఆర్ వారి ధన బలాన్ని చూసి నియోజకవర్గంలో వారి పలుకుబడిని చూసి కొనసాగించారని ,దాంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్( KCR ) పై ఆ స్థాయి వ్యతిరేకత లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే పై ఉన్న తీవ్ర వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గెలిపించారన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది.అందువలనే హేమాహేమీలు వంటి బి ఆర్ ఎస్ నాయకులను కూడా కాంగ్రెస్లోని యువ నాయకులు ఓడించగలిగారన్నది వీరి విశ్లేషణ తాలూకు సారాంశం.</br

దాంతో 150 స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ పార్టీ కూడా ఇప్పుడు సిట్టింగ్ ల పై ఉన్న ఆరోపణలపై ఆందోళన పడుతుందట చాలా చోట్ల సంక్షేమ పథకాల( Welfare schemes ) అమలు రీత్యా జగన్ కు ఆంధ్రప్రదేశ్లో మంచి పేరే ఉన్నప్పటికీ స్థానిక నాయకుల పనితీరు పై ఉన్న అసంతృప్తి తమకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందో అన్న ఆందోళన వైసీపీ అగ్రనాయకత్వం లో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి .దాంతో సిట్టింగ్ లను తిరిగి కొనసాగించే విషయంపై పూర్తిస్థాయిలో సర్వే ఫలితాలపై ఆధార పడాలని, ఎటువంటి మొహమాటాలకు పోకుండా కఠినంగా వ్యవహరించాలని వైసీపీ అగ్ర నాయకులు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.మరి పక్క రాష్ట్ర ఫలితాలను చూసైనా జాగ్రత్త పడకపోతే రేపు అదే పరిస్థితి రిపీట్ అవ్వొచ్చన్న ఆందోళనలో వైసిపి అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube