ఇది పక్కాగా పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరో గా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా కంటే ముందు ప్రకటించిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.

 Pawan Kalyan Two Movies Shooting Under Goes , Bhavadeeyudu Bhagath Singh , Bh-TeluguStop.com

మరో వైపు హరీష్ శంకర్‌ దర్శకత్వం లో గత ఏడాది క్రితం ప్రకటించిన భవదీయుడు భగత్‌ సింగ్ సింగ్‌ సినిమా కు ఇంకా కనీసం క్లాప్ కూడా పడలేదు.దాంతో పవన్ అభిమానులు చాలా అసంతృప్తి తో ఉన్నారు.

ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా పూర్తి కాకపోవడం పై అభిమానులు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.పవన్ పార్టీ పనలు చూసుకుంటూ సినిమా ల పనులను పక్కకు పెడుతున్నాడు.

దాంతో ఈ రెండు సినిమా ల విషయం లో చాలా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు రెండు సినిమా లకు ఒకే సారి డేట్లు ఇచ్చాడు.

రెండు సినిమా లు కూడా దాదాపు ఒకే చోట చిత్రీకరణ జరిపేలా.అంతే కాకుండా రోజులో రెండు షిప్ట్‌ లు వర్క్ చేసే విధంగా రెండు సినిమా ల షూటింగ్స్ ను నిర్వహించాలని దర్శక నిర్మాతలకు పవన్ సూచించాడు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే హరి హర వీరమల్లు సినిమా ను జూన్‌ నెలకు పూర్తి చేస్తారట.ఇక భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమా ను మాత్రం ఆగస్టు వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈ రెండు సినిమా ల షూటింగ్‌ కు సంబంధించిన విషయం ఖచ్చితంగా అభిమానులకు అతి పెద్ద శుభవార్త అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్‌ భీమ్లా నాయక్‌ సినిమా తర్వాత ఈ రెండు హిట్‌ అయితే హ్యాట్రిక్‌ అన్నట్లుగా అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube