పాతికెళ్ళ నాటి కథ.. ఉపేంద్ర దర్శకత్వంలో మెగాస్టార్.. కానీ అలా?

టాలీవుడ్ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కలిసి నటించిన తాజా చిత్రం గని.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Upendra Missed Chance Direct Megastar Chiranjeevi Movie Upendra, Chiranjeevi, To-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు టీచర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాను అల్లు బాబీ, సిద్దు ముద్దా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల కావడానికి మరికొన్ని గంటల సమయం ఉండటంతో, చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ వేడుకకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ నటుడు అయినా ఉపేంద్ర మాట్లాడుతూ పలు ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించారు.కన్నడ నటుడు ఉపేంద్ర ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

Telugu Chiranjeevi, Ghani, Tollywood, Upendra-Movie

ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర మాట్లాడుతూ.ఉపేంద్ర నటించిన A, ఉపేంద్ర లాంటి సినిమాల ద్వారా 24 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు తాను సుపరిచితమేనని తెలిపాడు.అయితే అంత కంటే ముందుగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది అని తెలుపుతూ ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించాడు.ఉపేంద్ర కు మెగా ఫ్యామిలీ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ.

నేను 24 సంవత్సరాల క్రితం డా.రాజశేఖర్ తో ఓంకారం అనే సినిమా డైరెక్షన్ చేశాను.ఆ సమయంలో అశ్వనీదత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది కాని నాకు ఆ అదృష్టం లేదు ఆ సినిమాను చేయలేకపోయాను అని ఉపేంద్ర చెప్పుకొచ్చాడు.అయితే ఆరోజు ఆ సినిమా చేయలేక పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు అని ఉపేంద్ర తెలిపాడు.

గని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube