కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడి పెంచిన పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ , విద్యుత్ చార్జీలను తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ డిమాండ్ చేశారు, పెట్రోల్ , డిజిల్ , గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ముందుగా కాంగ్రెస్ శ్రేణులంతా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు .
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదటు నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని అన్నారు .కేంద్ర ప్రభుత్వం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను అతి తక్కువ ధరకే దిగుమతి చేసుకుని వ్యాట్ పేరుతో ప్రజలపై భారం మోపుతోందని అన్నారు .కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ , డిజిల్ , గ్యాస్ ధరలు పెంచుతుండటంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థికభారం పడుతుందని అన్నారు .కేంద్ర ప్రభుత్వం వ్యాట్పరుతో 30 రూపాయలు , రాష్ట్ర భ్రుత్వం 35 రూపాయలు ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్నాయని అన్నారు .ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ , డీజిల్ , గ్యాస్లపై పన్ను భారం మోపి 36 లక్షల కో ట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశాయని అన్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పన్నుల ను తగ్గించుకోని పేదలకు పెట్రోల్ , డిజిల్ , గ్యాస్ ధరలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు .