యూవీ వారితో చరణ్ సినిమాపై మరోసారి క్లారిటీ వచ్చేసింది

మెగాస్టార్ తనయుడు చరణ్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

 Ram Charan 16 Movie With Goutham Thinnanuri , Ram Charan , Goutham Thinnanur-TeluguStop.com

ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు.చేస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్‌ లు.వీడియోలు విడుదల చేసి అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ని చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వడం జరిగింది.ఆచార్య సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.అలాగే యు.

వి.క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక సినిమా రామ్ చరణ్ చేయబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించిన విషయం ఇప్పటికే ప్రకటించారు.తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేసి అందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా మరో సారి వెల్లడించడంతో గౌతమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ జర్నీ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఒక సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జులై లేదా ఆగస్టులో పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

ఆ వెంటనే అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Chiran Jeevi, Hbd Ram Charan, Prabhas, Ram Charan, Ram Charan Day, Rc, Rr

ప్రభాస్ స్నేహితులు సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్ ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను చూసుకుంటున్నారు.వారిద్దరూ చరణ్ కు కూడా ఆప్త మిత్రులు అందుకే యు.వి.క్రియేషన్స్ లో చరణ్ నటించేందుకు ఓకే చెప్పాడు.ఆ విషయం మరోసారి ఈ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మా తరపున మీ తరఫున కూడా రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube