ఏ రంగంలో చూసినా దేశం తిరోగమనంలోనే ఉంది.దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం.
బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.ఇవీ మొన్నటి వరకు తెలంగాణ గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అన్న మాటలు.
అయితే ఉత్తరాది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్‌గానే ఉన్నారు.మళ్లీ రాజకీయాల్లో కాక రేపేందుకు వ్యహాలు రచిస్తున్నట్టు తెలిసింది.
దేశంలో కొత్త రాజకీయ పార్టీ రావచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు.ఏకంగా ప్రధాని మోడీపై యుద్ధం కూడా ప్రకటించిన విషయం విధితమే.
బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని పిలుపుకూడా ఇచ్చారు.ఇప్పుడేమో తమది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాదని, ప్రజల మేలు కోరే రాజకీయ ఫ్రంటు అని అభివర్ణించడం చర్చకు దారితీస్తోంది.
అయితే జాతీయ రాజకీయాల్లో తాను కీలకపాత్ర పోషించబోతున్నట్టు చెప్పుతున్నారు.రాజకీయాల్లో ముందు ముందు ఏం జరగబోతోందో ఎవరికి తెలుసంటూ ఎదురు ప్రశ్నించారు.యూపీఏ పరిస్థితి కన్నా నేడు దేశంలో పరిస్థితులు మరింత దిగజారి పోయాయని అన్నారు.ఇది జనాలకు సైతం తెలుసని చెప్పారు.అయితే ఉత్తరాది నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎలా గెలిచిందనే ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ఏఏ అంశాల్లో నిలదీస్తున్నారో.
అవే అంశాలు రాష్ట్రంలోను ఉన్నాయి.దేశంలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని సీఎం నిలదీస్తున్నారు.
కాగా గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో ఆయనకే తెలియాలి.మరోవైపు ఎన్డీఏ పాలనలో దేశంలో అరాచకం పెరిగిపోతోందని కేసీఆర్ అంటున్నారు.
ఇదే కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ లెక్కన మోడీ, కేసీఆర్ ఎదుర్కొంటున్న అంశాలు ఒకేలా కనిపిస్తున్నాయి.
మొత్తంగా సీఎం కేసీఆర్ రాజకీయాలు, ఆయన మాటలు మారుస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.అయితే పొలిటికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(పీకే) తనకు బాగా సన్నిహితుడని, ఆయనను తానే తీసుకొచ్చానని సీఎం చెప్పుకొచ్చారు.
కానీ, ఎప్పటి నుంచి సన్నిహితుడు, ఎలా సన్నిహితుడు అనేది తెలపలేదు.ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు.మరి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి ? ఎప్పటిలాగే తన మాట మారుస్తారా ? లేదా అనేది చూడాలి.
.