20 కోట్ల రూపాయలిస్తా నన్ను పెళ్లి చేసుకుంటావా.. ఆ హీరోకు అభిమాని కోరిక?

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న కార్తీక్ ఆర్యన్.

 Kartik Aaryan Hilarious Response Fans Who Proposed Marriage Him 20 Crore Offer K-TeluguStop.com

ఇకపోతే కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమాకు హిందీ రీమేక్ గా షెహజాదా సినిమాలో నటిస్తున్నాడు.కార్తీక్ ఆర్యన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.

ఒకవైపు సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీ ని సంపాదించుకున్నాడు.

యూత్ లో కార్తీక్ ఆర్యన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇది ఇలా ఉండే కార్తీక్ ఆర్యన్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేశాడు.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో అర్జున్ పాతక్ అనే ఒక అమ్మాయి ధమాకా సినిమాలోని డైలాగులు చెప్పింది.డైలాగ్ చెప్పడం పూర్తి అవ్వగానే ఇద్దరు చిరునవ్వులు చిందించారు.

ఇక ఈ వీడియోని చూసి నెటిజన్లు ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఒక్కొక్క నెటిజన్ ఒక్కొ విధంగా స్పందిస్తున్నారు.

కానీ ఒక నెటిజన్ మాత్రం 20 కోట్ల రూపాయలు ఇస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని కార్తీక్ ఆర్యన్ ను అడిగింది.

అందుకు కార్తీక్ ఆర్యన్ సరే అంటూ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడిగాడు.వచ్చేసేయ్ ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటూ ఆమె రిప్లై ఇచ్చింది.ఈ కామెంట్లు చూసిన కొందరు అమ్మాయిలు నేను కూడా 20 కోట్ల రూపాయలు ఇస్తాను నన్ను పెళ్లి చేసుకో అంటూ హీరో కార్తీక్ ఆర్యన్ వెంటపడ్డారు.

దీంతో కార్తీక్ ఆర్యన్ సరదాగా వేలంపాట వేద్దామా అని అన్నాడు.ఇకపోతే కార్తీక్ ఆర్యన్ చివరిసారిగా ధమాకా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది.ప్రస్తుతం అలా వైకుంఠపురములో సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమాను ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాతో పాటుగా కార్తీక్ ఆర్యన్ భూల్ భులాయా 2, ఫ్రెడ్డి సినిమాలలో నటించాడు.

ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube