పూజా హెగ్డే.ప్రస్తుతం తెలుగుతో పాటు ఇటు సౌత్ లోనూ.
అటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ.తన అందంతో పాటు అభినయంతో సినిమా పరిశ్రమలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ రేంజి సినిమాలు చేస్తుంది.అయితే ఈ ముద్దుగుమ్మ పలువురు టాప్ హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చినా.
వదులుకుంది.ఇంతకీ ఆయా కారణాలతో తను రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*వకీల్ సాబ్పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇది.ఇందులో పవన్ సరసన నటించే అవకాశం వచ్చింది.అయితే పూజా మాత్రం ఈ సినిమా చేయలేనని చెప్పింది.దీంతో తన ప్లేస్ లో శృతి హాసన్ ను తీసుకున్నారు దర్శక నిర్మాతలు.అయితే తను ఎందుకు ఈ సినిమా చేయలేదు అనేది మాత్రం బయటకు తెలియదు.
*మాస్ట్రోనితిన్ నటించిన మాస్ట్రోలో కూడా తొలుత అవకాశం వచ్చింది.
కానీ తను అంగీకరించలేదు.
*హరిహర వీరమల్లుపవర్ స్టార్ తో కలిసి క్రిష్ చేస్తున్న ఈ సినిమాలో కూడా తొలుత హీరోయిన్ గా పూజాను అనుకున్నారు.కానీ తను చేయకపోవడంతో నిధి అగర్వాల్ ను తీసుకున్నారు.
*అల్లుడు అదుర్స్బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించే అవకాశం వచ్చినా.
పూజా వదులుకుంది.కారణం తనకు డేట్స్ కుదరలేదట.
*ఛత్రపతి హిందీ రీమేక్బెల్లకొండ బాలీవుడ్ లో చేసిన ఈ సినిమాలో కూడా పూజాకే తొలుత అవకాశం వచ్చింది.అయితే తను రీమేక్ సినిమాలు చేయలేనని చెప్పింది.దీంతో చాన్స్ మిస్ అయ్యింది.
*శాకుంతలంసమంత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కూడా తొలుత పూజాను అనుకున్నారు.కానీ తనకు మొహంజదారో లో పెద్దగా కలిసి రాలేదు.దీంతో ఆ సినిమా చేయలేను అని చెప్పింది.
*గుడ్ బైబాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించే అవకాశం వచ్చింది.అయితే అదే సమయంలో తనకు మంచి అవకాశం రావడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పింది.