ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో లవ్, పెళ్లి, బ్రేకప్, విడాకులు లాంటి పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న జంటలో కొన్ని కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండానే విడిపోతూ ఉంటారు.

 Bigg Boss Ott Winner Divya Agarwal Announces Split Varun Sood Divya Agarwal, Var-TeluguStop.com

ఇంకొన్ని జంటలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొద్ది రోజులపాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత విడిపోతూ ఉంటారు.ఇప్పటికే ఎన్నో జంటలు అలా విడిపోయిన విషయం తెలిసిందే.

తాజాగా బాలీవుడ్ నటి, మోడల్, బిగ్ బాస్ ఓటిటి ఈ విజేత అయిన దివ్య అగర్వాల్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది.

దివ్య అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ వరుణ్ సూద్ తో నాలుగేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.జీవితం ఒక సర్కస్ లాంటిది.

అందరినీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఎవరిని ఏది ఆశించవద్దు.అది నిజం అంతే కాకుండా సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరిని నిందించను.అదే మంచిది.నాకోసం నేను బతకాలి అనుకుంటున్నాను.అదే కాకుండా నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించడానికి సమయం వెచ్చించాలి అనుకొంటున్నాను.

బిగ్ బాస్  అందువల్లే తాము విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది దివ్య అగర్వాల్.అంతే కాకుండా ఒక నిర్ణయం తీసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు.దీని నుంచి బయట పడడానికి నేను తీసుకున్న నిర్ణయమే.

నాతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే .అతను ఒక గొప్ప వ్యక్తి.తాను ఇప్పుడు నాకు మంచి స్నేహితుడే.దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి అంటూ తన బ్రేకప్ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేసింది దివ్య అగర్వాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube