రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ సినిమా తొలి వారం రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ సంఖ్యలో థియేటర్లలో భీమ్లా నాయక్ ప్రదర్శితమైంది.
రాధేశ్యామ్ సినిమా విడుదలైనా ఆ సినిమా క్లాస్ సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే వరకు భీమ్లా నాయక్ పరిమిత సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు ఈ వారం థియేటర్లలో మూడు సినిమాలు రిలీజవుతున్నాయి.
మూడు సినిమాలలో దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామిక ఈరోజే విడుదల కాగా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోవడం, ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా సరిగ్గా నిర్వహించకపోవడం మైనస్ అవుతోంది.మరోవైపు రేపు థియేటర్లలో ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపై బాగానే అంచనాలు నెలకొనగా శర్వానంద్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.
ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పరవాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.గతేడాది శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో శర్వానంద్ రెండు డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమాలతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది.
అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదని అందుకు కారణం భీమ్లా నాయక్ సినిమా అని సమాచారం.మాస్ మూవీ కావడంతో థియేటర్ల ఓనర్లు భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.భీమ్లా నాయక్ వల్ల ముగ్గురు హీరోల సినిమాలకు కష్టాలు వచ్చాయి.భీమ్లా నాయక్ మరో పాతిక కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది.