టాలీవుడ్ లో తన అభినయంతో మెప్పించే అతి తక్కువమంది హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు.ఈమధ్య కెరియర్ లో వెనక పడిన అమ్మడికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చింది.
భీమ్లా నాయక్ సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ కొట్టినా ఆ సినిమా ప్రమోషన్స్ లో కానీ.పర్సనల్ గా ఆ సినిమా గురించి కానీ నిత్యా మీనన్ ప్రస్తావించడం లేదు.
దీని వెనక చాలా పెద్ద కథ ఉందని తెలుస్తుంది.
భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.
అయితే సినిమాలో ఇంకొన్ని సీన్స్ ఉన్నాయట.అంతేకాదు పవన్, నిత్యా మీనన్ ల మధ్య అంత ఇష్టం ఏందయ్య సాంగ్ కూడా ఉంది.
కానీ సినిమా రన్ టైం కోసం వీటిని కట్ చేశారు.ఇదే నిత్యా మీనన్ ని బాగా హర్ట్ అయ్యేలా చేసిందని అంటున్నారు.
అందుకే < భీమ్లా నాయక్ ప్రమోషన్స్ కి నిత్యా మీనన్ దూరంగా ఉందని చెబుతున్నారు.కెరియర్ దాదాపు అయిపోయింది అనుకుంటున్న టైం లో భీమ్లా నాయక్ రూపంలో నిత్యా మీనన్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడ్డది.
అది ఎంజాయ్ చేయకుండా అమ్మడు లేనిపోని విషయాల మీద ఫోకస్ పెడుతుందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
.