బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈమె వస్త్ర ధారణ వల్ల మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.
ఉర్ఫీ జావేద్ అంటేనే గ్లామరస్ షో కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా ఈమె విభిన్న వస్త్రధారణలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ గురవుతారు.
ఈ విధంగా ఈమె వస్త్రధారణ చూసిన ఎంతో మంది నెటిజన్లు ఏకంగా పాప దుస్తులను నువ్వే డిజైన్ చేసుకుంటావా? లేక ప్రత్యేకంగా డిజైనర్ ఉన్నారా? అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తుంటారు.ఇలా ప్రతిసారీ నెటిజన్ల నుంచి ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నప్పటికీ ఈమె తన వస్త్రధారణలో ఏ విధమైనటువంటి మార్పు చేయలేదు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే కానుకగా ఈ ముద్దుగుమ్మ మరొక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈమె వస్త్రధారణపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చొక్కాని తిరిగేసి బటన్స్ వెనక వైపు ఉండేలా షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ షేర్ చేయడంతో చాలా మంది నెటిజనులు స్పందిస్తూ….ఈ స్టైల్ పేరేంటో తెలుసా? ఉల్టా షర్ట్, ఈమె మెదడు మోకాలిలో ఉందని చెప్పడానికి మరో నిదర్శనం టు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఎవరు ఊహించని విధంగా విభిన్న వస్త్రధారణలో నెటిజన్లను ఆశ్చర్యపరచడంలోనూ వారిచేత ట్రోలింగ్ కి గురికావడంలోను ఈ ముద్దుగుమ్మకు ఎవరు సాటి లేరు అని చెప్పవచ్చు.