రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థకు సంబంధించి సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్య ఇటీవల తలెత్తడంతో జనవరి ఒకటవ తేదీ లేదా రెండవ తేదీ నుండి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఆగిపోయింది.ఇటువంటి తరుణంలో మంగళవారం నుండి రేషన్ పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భావించగా.
ఇంకా సాంకేతిక సమస్య విడకపోవటంతో బుధవారం నుండి రాష్ట్రంలో రేషన్ పంపిణీ జరగనున్నట్లు రేషన్ కార్డు దారులు రెడీ గా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రతి కార్డుపై 10 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే రేషన్ డీలర్ల లో ఎవరైతే కరోనా బారినపడ్డారు వారి స్థానంలో కొత్తగా మరొకరిని నియమించే పరిస్థితి ఉండదని.ఉన్న సిబ్బంది అదనంగా విధులు నిర్వహిస్తూ ఉండటంతో రేషన్ డీలర్లు పని భారం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా బారినపడ్డ సిబ్బంది స్థానంలో మరొకరిని తీసుకుంటే బాగుంటాదని.పని భారం తగ్గుతుందని చెప్పుకొస్తున్నారు.