ప్రతి ఒక్క ఆడవారు తల్లి కావాలని కోరుకుంటూ ఉంటారు.ఆడవారికి తల్లి అవ్వడం అది దేవుడిచ్చిన గొప్ప వరం.
కన్నతల్లి నవమాసాలు మోసి కన్నబిడ్డ చేతిలోకి రాగానే అప్పటివరకు తాను పడ్డ కష్టాలు బాధలు అన్నీ మరిచిపోతుంది.అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటారు.
తొందర ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బరువు పెరుగుతూ తగ్గుతూ ఉంటారు.అయితే ఇలాంటి కాలంలోనే కొందరు అందంగా కనిపించడం కోసం నా పడుతూ ఉంటారు.
అయితే సన్నబడటం మంచిదే కానీ ముందు ఆరోగ్యంగా ఉండాలి అంటోంది హీరోయిన్ సాయేషా సైగల్.
అఖిల్ సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది సాయేషా సైగల్.
ఈమె కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.సాయేషా సైగల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో విపరీతంగా బరువు పెరిగింది.ప్రస్తుతం ప్రసవం అనంతరం ఆమె వర్కౌట్లు చేస్తూ బరువు తగ్గించుకుంది.
ఆ అనుభవాలను ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకునే.జిమ్ లో వర్క్ అవుట్ లతోపాటు డాన్స్ చేస్తూ బరువు తగ్గించుకుంది.కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె బరువు తగ్గించుకునే క్రమంలో తన ఆలోచనలను తెలిపింది.బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు.అదనంగా పెరిగిన మీ బరువును ఒక క్రమపద్ధతిలో తగ్గించుకోవాలి.
అంతే కాకుండా మనం ఎంతవరకు బరువు తగ్గించుకోవడం అనేది ఆలోచించుకోవాలి.సన్నగా అవ్వడం కంటే ముందుగా ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రాదాన్యత ఇవ్వాలి అని ఆమె తెలిపింది.
అలాగే ఆరోగ్యకరమైన మారాలి అంటే కొంచెం సమయం పడుతుందని, ప్రతి ఒక్కరు శరీరము ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఆ పరిస్థితులకు అనుగుణంగా బరువును తగ్గించు కుంటే బాగుంటుంది అని సాయేషా సైగల్ చెప్పుకొచ్చింది.