కొన్నేళ్ల క్రితం వరకు యాంకర్ గా వరుస ఆఫర్లతో ఉదయభాను బిజీగా ఉన్నారు.రియాలిటీ షోలతో పాటు ఈవెంట్లకు సైతం ఉదయభాను యాంకర్ గా వ్యవహరించేవారు.
సాహసం చేయరా డింభకా, మరికొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ఉదయభానుకు మంచి గుర్తింపు వచ్చింది.పలు సినిమాలలో సైతం ఉదయభాను కీలక పాత్రలలో నటించగా ఆ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం గమనార్హం.
అయితే ఈ మధ్య కాలంలో ఉదయభానుకు ఆఫర్లు తగ్గగా పుష్ప ఈవెంట్ కు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించి సందడి చేశారు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి.అయితే తాజాగా జరిగిన ఈవెంట్ లో ఉదయభాను పుష్ప కలెక్షన్ల నుంచి తప్పుగా చెప్పారు.
203 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను పుష్ప మూవీ సాధించిందని చెప్పడానికి బదులుగా 2,003 కోట్ల రూపాయల కలెక్షన్లు పుష్ప సాధించిందని చెప్పడంతో నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.ఉదయభాను టంగ్ స్లిప్ అయిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప మూవీ కలెక్షన్ల విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్లతో పుష్ప మూవీ భారీ కలెక్షన్లను సాధించడం సులభమైన విషయం కాదు.ఏపీలో పుష్ప ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే.పుష్ప సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.
పుష్ప మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.