డ్రైడ్ పపాయ లేదా ఎండిన బొప్పాయి.చాలా మందికి దీనిపై పెద్దగా అవగాహనే లేదు.దాదాపు అందరికీ పండు బొప్పాయిని తినడమే అలవాటు.కానీ, డ్రైడ్ బొప్పాయి కూడా మార్కెట్‌లో విరివిగా లభిస్తుంది.బొప్పాయి పండును ఎండ బెట్టిన తర్వాత రంగు, రుచి మారినప్పటికీ.పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.
అలాగే ఆరోగ్యానికి ఎండిన బొప్పాయి అమోఘమైన ప్రయోజనాలను అందిస్తుంది.పైగా డ్రైడ్ పపాయ ఎప్పడూ మార్కెట్ అందుబాటులోనే ఉంటుంది.
బొప్పాయి పండ్లు దొరకని వారు చక్కగా డ్రైడ్ పపాయను తెచ్చుకుని డైట్‌లో చేర్చుకుంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.ఆలస్యమెందుకు మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ.? అసలు డ్రైడ్ పపాయను ఎలా తీసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోయింది.అయితే డ్రైడ్ పపాయ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.డ్రైడ్ పపాయను పౌడర్ చేసుకుని నీటిలో కలిపి రోజూ తీసుకోవాలి.తద్వారా కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోయి శుభ్రంగా మారుతుంది.
మరియు కాలేయ వ్యాధులు క్రమక్రమంగా తగ్గు ముఖం పడతాయి.

అలాగే డ్రైడ్ పపాయను పౌడర్ చేసుకుని సలాడ్లు లేదా సూప్‌ల వంటి ఆహారాల్లో మిక్స్ చేసి తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు. ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.నీరసం, అలసట, రక్త హీనత వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారూ రెగ్యులర్‌గా డ్రైడ్ పపాయను డైరెక్ట్ తీసుకుంటే.
ఆయా సమస్యలు దూరం అవుతాయి.శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.
అంతే కాదు, డ్రైడ్ పపాయను డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగ్గా మారుతుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.చర్మ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు రక్త పోటు స్థాయిలు అదుపు తప్పకుండా కూడా ఉంటాయి.