మాట మార్చిన సిరి.. నాలుగో స్థానంలోకి పడిపోయిన షణ్ముఖ్?

బిగ్ బాస్ కార్యక్రమం కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో శనివారం నాగార్జున హౌస్ సభ్యులతో పలు రకాల గేమ్స్ ఆడించారు.ఈ క్రమంలోనే హౌస్ సభ్యులతో నాగార్జున 14 వారాలను పరిగణలోకి తీసుకొని హిట్ స్టార్ ప్లాప్ స్టార్ ఎవరో చెప్పాలని తెలిపారు.

 Bigg Boss 5 Telugu Nagarjuna Announces Sunny In Second Finalist Details, Bigg B-TeluguStop.com

ఈ ఆటలో భాగంగా కంటెస్టెంట్ సన్నీకి అధికంగా ఎక్కువ హిట్ రావడంతో సన్నీ టాప్ టూ ఫైనలిస్ట్ గా నిలిచారు.ఈ ఆట తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ మరొకసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు వరుసగా నిలబడి చెప్పగా హౌస్ లో ఉన్నటువంటి అబ్బాయిలు అందులో మొదటి స్థానంలో నిలబడ్డారు.

ఇక అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానం తో సరిపెట్టుకుంటున్నారని తెలిపారు.ఇక హౌస్ లో ఉన్నటువంటి సిరి, షణ్ముఖ్ చాలా క్లోజ్ అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సిరి షణ్ముఖుని మొదటి స్థానంలో చూడాలని ఎన్నోసార్లు వెల్లడించింది.అయితే సిరి ఇచ్చిన మాటపై సిరి నిలబడలేదని నిన్నటి ఎపిసోడ్ లో తేటతెల్లమైంది.

Telugu Bigg Boss, Bigg Boss Lask, Finalist, Kajal, Manas, Shannu, Shannu Siri, S

షన్నుని మొదటి స్థానంలో చూడాలనుకున్న సిరి తన మాటను వెనక్కి తీసుకుని తను వెళ్లి ఫస్ట్ ర్యాంక్ పై నిలబడింది.ఈ క్రమంలోనే షణ్ముఖ్​     నాలుగవ స్థానానికి వెళ్లి పోయాడు.శ్రీరామ్‌, కాజల్‌, షణ్ముఖ్‌, సన్నీ, మానస్‌ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు.ఇక ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారనే విషయం తెలిస్తే కంటెస్టెంట్ ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube