భవన నిర్మాణ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా పరిగణించే ‘రాయల్ గోల్డ్ మెడల్’ అవార్డును భారత ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోశీ దక్కించుకున్నారు.రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ (ఆర్‌ఐబీఏ) ఈ మేరకు గురువారం ప్రకటించింది.
బాలకృష్ణ తన 70 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ప్రఖ్యాత ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారని, భారతదేశ భవన నిర్మాణ రంగాన్ని ఎంతో ప్రభావితం చేశారని ఆర్ఐబీఏ ప్రశంసించింది.కన్స్ట్రక్షన్ రంగానికి ఆయన జీవితాంతం చేసిన కృషికి గుర్తింపుగా 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డును బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 బాలకృష్ణకు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు అని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ వెల్లడించింది.
బాలకృష్ణ పనిచేసిన 100 ప్రాజెక్ట్‌లలో ఎన్నో కళాఖండాలు వున్నాయి.ఛండీగడ్ నగర నిర్మాణానికి కావాల్సిన డిజైన్‌లపై లీ కార్బుసియర్‌తో కలిసి పనిచేశారు. అలాగే అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోసం లూయిస్ ఖాన్‌తో కలిసి అసోసియేట్‌గా పనిచేశారు.ఇతర ఐకానిక్ ప్రాజెక్ట్‌లలో అహ్మదాబాద్‌లోని శ్రేయాస్ కాంప్రహెన్సివ్ స్కూల్ క్యాంపస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు, అమ్దవద్ ని గుఫా వంటివి వున్నాయి.
దోశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.పూణేలోని ఒక విశాలమైన ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో గడిచిన తన బాల్యం గురించి చెప్పారు.
వడ్రంగి అయిన తండ్రి వర్క్‌షాపులో బాలకృష్ణ ఎక్కువ సమయం గడిపేవారట.అక్కడ చెక్క పొట్టును సేకరించి దాని సాయంతో కొన్ని డిజైన్లు చేసేవారట.
అయితే డిజైన్‌పై పెంచుకున్న ఆసక్తి ఆయనను పెయింటింగ్ క్లాస్‌లలో చేరేలా చేసింది.ఈ సమయంలో బాలకృష్ణ.
గ్రామ వాతావరణం, ఇళ్లు, దేవాలయాలు, జంతువుల చిత్రాలను గీసేవారు.అనంతరం దోశీ బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చేరారు.
ఈ కోర్సు మధ్యకాలంలో అంటే 1950లో ఆర్ఐబీఏలో అసోసియేట్‌గా పనిచేసేందుకు బాలకృష్ణ లండన్‌కు వచ్చారు.తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం అన్న కల సాకారం చేసినందుకు గాను ‘ఆర్కిటెక్చర్ నోబెల్’గా పిలిచే ప్రిట్జ్‌కర్ ప్రైజ్ ఆయనను వరించింది.