వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా భీమ్లా నాయక్.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన బొద్దుగుమ్మ నిత్యా మీనన్ నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్, పాటలు విడుదల అయ్యాయి.ఇవన్నీ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి అడవి తల్లి అనే పాట విడుదల అయ్యింది.జనాల నుంచి ఈ పాట ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుంది.
అందరినీ ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అడవి తల్లి పాట రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.
అయితే ఈ పాటను పాడిన వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ పాటను జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి పాడారు.
ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో కుమ్మరి దుర్గవ్వ గురించి నెటిజన్లు వెతుకుతున్నారు.ఇంతకీ ఈ దుర్గవ్వ ఎవరు? అంటూ సెర్చ్ చేస్తున్నారు.

కుమ్మరి దుర్గవ్వ మంచిర్యాలకు చెందిన వ్యక్తి.ఏం చదువుకోలేదు.పొలం పనులు చేస్తుంది.అప్పుడు తను జానపదాలు పాడుతుంది.దుర్గవ్వ తెలుగుతో పాటు మరాఠీలోనూ పలు పాటలు పాడింది.తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే అనే పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి.

సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ గా నిలిచింది కూడా.దీంతో పాటు సిరిసిల్లా చిన్నది అనే పాట కూడా ఈమే పాడింది.తాజాగా భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి పాటకు జనాల నుంచి మంచి ఆదరణ వస్తుంది.అటు ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయబోతున్నారు.