సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి వరుస పెట్టి స్టార్స్ అందరితో సినిమాలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక మధ్యలో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కూడా ఇప్పుడు మళ్ళీ వరుస అవకాశాలు అందుకుంటూ తన హవా కొనసాగిస్తుంది.
తమన్నా తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ కెరీర్ ను గాడిలో పెట్టుకుంది.
ఇక ఈ బ్యూటీ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులు ఈమెను ఫాలో అవుతూ ఉన్నారు.ఇక మిల్కీ బ్యూటీ స్టైల్ ప్రత్యేకం అనే చెప్పాలి.
ఆమె ఏ దుస్తుల్లో అయినా ఫ్యాన్స్ ను యిట్టె ఆకట్టుకుంటుంది.ఆమె సెలక్ట్ చేసుకునే ఫ్యాషన్ కు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.
ఈమెకు బ్యూటీ ఫ్యాషన్ పై మంచి పట్టు ఉంది.
తాజాగా ఈ బ్యూటీ మరొకసారి తన స్టైలింగ్ తో అందరిని కట్టి పడేస్తుంది.
లేటెస్ట్ గా ఈమె రంగురంగుల అందమైన దుస్తులతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోస్ లో తమన్నా తన స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యే కలర్ ను వాడడంతో మరింత అందంగా కనిపిస్తుంది.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె బ్యూటీకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రెజెంట్.మెగాస్టర్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుంది.ఇక తమన్నా ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో వెంకీ సరసన నటిస్తుంది.