భీమ్లా నాయక్ సాంగ్ వాయిదా.. కారణం అదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Bheemla Nayak Song Postponed Confirm Makers Details,  bheemla Nayak Fourth Sing-TeluguStop.com

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

పవన్ కారణంగా ముందు నుండే అంచనాలు ఉన్నా కూడా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ల కారణంగా మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండడంతో ఈ సినిమా మరోక రేంజ్ కు వెళ్ళిపోయింది.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

దాంతో ప్రమోషన్స్ నెల ముందు నుండే స్టార్ట్ చేశారు.

అప్డేట్ అప్డేట్ కు ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస అప్డేట్ లు ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాలో  ఏ విధంగా హల్ చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తమన్ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇక నిన్న ఈ సినిమా నుండి నాలుగవ పాటను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.అడవి తల్లి మాట అనే పాటను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా ఈ సినిమా మేకర్స్ ఈ పాటను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సాంగ్ ను రిలీజ్ చేయక పోవడానికి సాహిత్య దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం అని తెలుస్తుంది.టాలీవుడ్ ఒక లెజెండరీని కోల్పోయింది.ఈ విషాద సమయంలో ఇలాంటి అప్డేట్ లు సరైనది కాదని అందుకే ఆయన గౌరవార్ధం ఈ పాటను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు.

త్వరలోనే మేకర్స్ మరొక కొత్త డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube