వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో.
చంద్రబాబు ఏడవటం పట్ల.రోజా స్పందించడం జరిగింది.
నాయకుడనేవాడు ఏడవ కూడదని., ఏడిస్తే గనుక ఆ నాయకుడు వెనకాల ఉన్న వాళ్లంతా బలహీనులవుతారు.
చంద్రబాబు ఏడుపు చూస్తే ఎవరికి సింపతి కలగలేదని, కుప్పం ఓటమి ఈ విషయంలో ప్రజల దృష్టిని డ్రైవర్ట్ చేయడానికి ఆయన వ్యవహరించారని రోజా స్పష్టం చేశారు.
ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ నాయకులు తిట్టడం వెనకాల.
చంద్రబాబు హస్తం ఉందని అన్నారు.లోకేష్ పొలిటికల్ కెరియర్ కి ఎక్కడ అడ్డొస్తాడో అనే భయంతో ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు.
వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎన్టీఆర్ కుటుంబం విషయంలో చంద్రబాబు చాలా నీచాతి నీచంగా వ్యవహరించారని, ఆయన తండ్రి హరికృష్ణ మరణించిన సమయంలో అక్కడ పొత్తు రాజకీయాలు.
మాట్లాడిన ఘనుడు చంద్రబాబు అంటూ రోజా సెటైర్లు వేశారు.ఎన్టీఆర్ వెనకాల వైసీపీ లేదని ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి.
అన్న తరహాలో రోజా తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.