Abraham Lincoln democratic system : ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు వెళ్లాల్సిందే

భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలించారు .భారతదేశానికి స్వాతంత్రం 1947 సంవత్సరం ఆగస్ట్ 15 రోజున వచ్చింది.1950లో భారత రాజ్యాంగం భారత దేశాన్ని సర్వసత్తాక గణతంత్ర స్వామ్యవాధ లౌకిక రాజ్యాంగ ప్రకటించుకోవడం జరిగింది.భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది.

 Public Representatives Have To Go To The People, Abraham Lincoln , Constituency-TeluguStop.com

ప్రజాప్రతినిధులు ప్రచ్ఛన్న పాలన ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేక తమ అనుయాయుల ద్వారా పరోక్ష “ప్రచ్ఛన్న “పాలనకు పాల్పడటం వల్ల ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య గాప్ ఏర్పడి ప్రజాసమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోక పోవడం వల్ల ప్రజలు అసహo అసంతృప్తికి గురౌతున్నారు.ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు అమలు కాని హామీలు’ మనీ మద్యం’ మోసపూరిత ప్రకటనలు వివిధ’ ప్రలోభాలతో వోటర్లను ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ‌ అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయి.ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు మళ్లీ ఎన్నికల సమయంలోనే దర్శనం ఇచ్చే సంస్కృతి రాజ్యమేలటం శోచనీయం.”ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని అమెరికా మాజీ అధ్యక్షులు అభ్రహం లింకన్ అన్నారు” .కానీ వాస్తవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ప్రజా ప్రతినిధుల” ప్రచ్చన పాలన” తో నియోజక వర్గ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు పేదరికం నిరుద్యోగం ‘ఆర్థిక అసమానతలు ప్రాంతీయ అసమానతలు సామాజిక వ్యత్యాసాలు రాజ్య మేలుతున్నాయి.

ప్రజాప్రతినిధులు నిర్ణీత సమయంలో వారి వారి నియోజకవర్గాలలో ప్రతినెల నిర్ణీత సమయంలో ప్రజలందరినీ కలసి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారాల పట్ల శ్రద్ధ చూపాలి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నెలవారీ క్యాలెండర్ విడుదల చేసి కార్యాచరణకు పూనుకోవాలి.

ప్రజలకు ఉపాధి హామీ ఆదాయాల సృష్టి.ఆస్తులు సంపదను సృష్టించే ప్రణాళికలను అమలు చెయ్యాలి.తమ నియోజక వర్గ పరిధిలో భౌగోళిక పరిస్థితి లభించే సహజవనరులు స్థాపించే పరిశ్రమల పట్ల అధ్యయనం చెయ్యాలి.తమ నియోజక వర్గంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల అభివృధి మార్కేట్ అభివృధి రవాణా రోడ్ల విస్తరణ పట్ల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయం ప్రకారం అభివృధి సంక్షేమం కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికలు పథకాల అమలుకు కృషి చెయ్యాలి.

ప్రాజెక్టులకు కావలసిన నిధులు నియామకాలు ‘వసతులు కల్పన మహిళా యువజన సంక్షేమం సామాన్యుని సాధికారిత సాధనా మన్నాగు అంశాలలో సూక్ష్మ ‘స్థూల స్థాయి ప్రణాళికలు రూపొందించి అమలు చెయ్యాలి .

Telugu Abraham Lincoln, Ap Poltics, Constituency, Socioeconomic, Ys Jagan-Politi

ప్రభుత్వ అధికారులతో పనులనుసమీక్ష చెయ్యాలి .ప్రభుత్వ అధికారులు తప్పని సరిగా సమీక్ష సమావేశాలకు హాజరు కావాలి.ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లో చేర్చాలి.

పాలనలో జవాబుదారీతనం ‘పారదర్షనికతకు పెద్ద పీట వెయ్యాలి.ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు .గల్లి నుండి ఢిల్లీ వరకు వార్డు సభ్యుడు మొదలుకొని పార్లమెంటు సభ్యుని వరకు.ప్రజాప్రతినిధులు నియోజక వర్గ ప్రజలకు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి.‘”గెలుపు పల్లెల్లో నివాసం పట్టణాల్లో” అన్న చందంగా గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉండడం వలన ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.తమ సమస్యలు విన్నవించుకోవడనికి గాను గ్రామీణ ప్రాంత ప్రజలునిత్యం రవాణా సౌకర్యాలు ఉపయోగించుకొని తెల్లవారక ముందే ప్రజా ప్రతినిధి నిద్రలేవక ముందే పట్టణాలలో ప్రజా ప్రతినిధి ఇంటి ముందుప్రజలుప్రత్యక్షమైసమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది.

ఈ‌ విధానం లో మార్పు రావాలి.ప్రజల వద్దకు”ప్రజాప్రతినిధులు వెళ్లి సమస్యలనుతెలుసుకునిపరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి .అప్పుడే ప్రజాస్వామ్యం ప్రగతి ఫలాలు సామాన్యునికి అందుతాయి.ప్రభుత్వ అధికారులతో ప్రజలతో కలిసి సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే అభివృధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది.

సామాజిక ఆర్థిక పంపిణీ న్యాయం జరిగి ప్రజల జీవన ప్రమాణాలు కొనుగోలు శక్తి సామర్థ్యాలు పెరిగి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది.ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఇనుమడిస్థాయి.

ప్రజా ప్రతినిదులు ప్రజా సేవకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజాసేవకులు ప్రజలే నిజమైన ప్రభువులు అన్న సత్యాన్ని ప్రజా ప్రతినిధులు మరిచిపోకూడదు.ప్రతి గ్రామములో జరిగే గ్రామ పంచాయితీ నిర్వహించే

వసతుల కల్పనలో క్రియాశీలక పాత్ర పోషించాలి.ఎన్నికలప్పుడు ఓట్ల కొరకు పోటీ పడిన స్ఫూర్తిని ఎన్నికల తర్వాత ఎన్నికైన శాసనసభ్యులు అభివృధి సంక్షేమ పథకాల అమలులో చూయించాలి.

ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన అంశాలను తమ నియోజక వర్గ స్థాయిలో అమలు చేయడానికి సూక్ష్మ స్థూల స్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలి ప్రజాప్రతినిధులు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి.మెరుగైన ప్రజాసేవలు అందిస్తూ ప్రజల విశ్వాస పరిరక్షకులుగా భారత గణతంత్ర బలోపేతానికి క్రమశిక్షణ కలిగిన సైనికులుగా నిలువాలి.

ప్రజా ప్రతినిధులు ప్రజల ఆశలు’ ఆకాంక్షల సాధనకు సారథులుగా నిలువాలని ఆశిద్దాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube