తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదవి స్వీకారం చేసిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల విషయంలో.
ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చడం జరిగింది.మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య( Mahalakshmi )శ్రీ పథకాలను అమలు చేయడం జరిగింది.
డిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టినరోజు నేపథ్యంలో ఆరోజు ఈ రెండు పథకాలను ప్రారంభించడం జరిగింది.ఇదిలా ఉంటే శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే.
కాగా తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ లుగా బాధ్యతలు స్వీకరించిన 54 మంది నియామకాలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా పదవి అధిరోహించిన తర్వాత చాలావరకు.
గత ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీంతో పాలనపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే మంత్రి సీతక్కతో కలిసి MCHRD సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది.MCHRD సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట.
ఈ క్రమంలో MCHRDని క్యాంపు కార్యాలయంగా మారిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై పలువురు ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపటం జరిగింది.దాదాపు 40 ఎకరాల విస్తీర్ణం హెలిపాడ్ సౌకర్యం, భవనాలు ఉండటంతో.
సీఎం క్యాంప్ కార్యాలయానికి అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ ఉన్నత అధికారులు తమ అభిప్రాయాలు రేవంత్ రెడ్డికి తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి.