టాలీవుడ్ ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఆల్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ అయిపోయిన అనంతరం అల్లు అర్జున్ ప్రమోషన్స్ తో మరింత బిజీ కానున్నాడు.
ఆల్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఇప్పటి నుంచే సందేహాలను సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో ప్రమోట్ చేయడానికి బరిలోకి ఏకంగా అల్లు అర్జున్ తిరుగుతున్నారట.
ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 15 వ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ హిందీ బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టబోతున్నాడట.ఇలా వినూత్న రీతిలో అల్లు అర్జున్, సుకుమార్ స్కెచ్ వేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.
అదే విధంగా బన్నీ నటించిన సినిమా మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుండటం విశేషం.ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్ 15 కి సల్మాన్ ఖాన్ హౌస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.