అమెరికాలో “తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్” దాతృత్వం...!!

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు కారు ప్రమాదంలో గాయపడిన ఘటన అందరికి తెలిసిందే.అయితే ఆ ప్రమాదం అనంతరం వారు ఎదుర్కున్న ఆర్ధిక పరిస్థితులు ఊహించని విధంగా వారిని చుట్టుముట్టాయి.

 Telangana American Telugu Association To Help Students,tta, Telangana American T-TeluguStop.com

ఆ సమయంలో వారు ఎదుర్కున్న మానసిక పరిస్థితి తెలంగాణలో ఉన్న వారి కుటుంభ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం.అమెరికాలో ఓ వ్యక్తికి వైద్యం చేయించాలంటే తప్పనిసరిగా అతడికి ఇన్స్యూరెన్స్ ఉండి తీరాల్సిందే, లేదా అతడికి ఉద్యోగం అయినా ఉండాలి లేకపోతే అక్కడి ఆసుపత్రుల బిల్లులు కట్టడానికి మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇలాంటి స్థితిలో ఎలాంటి ఇన్స్యూరెన్స్ లేకుండా ఆర్ధికంగా చేతిలో చిల్లిగవ్వ లేని ఇద్దరు విద్యార్ధులు అండగా నిలిచింది తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)

TTA సంస్థ ప్రతినిధులకు ఈ ఇద్దరు విద్యార్ధుల దయనీయ పరిస్థితి తెలియడంతో వారికి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి నిలబడ్డారు.అక్కడి వైద్యులతో మాట్లాడి వారి ఖర్చును తాము భరిస్తామని తోడుగా నిలిచారు.

అంతేకాదు వారిని చూసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు.అయితే ఇద్దరు విద్యార్ధులు కోలుకోవడానికి సమయం పడుతుందని ఫిజియోతెరఫీ ద్వారా ఇది సాధ్యమవుతుందని కాబట్టి స్వదేశంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో TTA అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.అయితే

వీరి ప్రయాణానికి కేవలం బిజినెస్ క్లాస్ లో ప్రయాణం సురక్షితమని వైద్యులు సూచించడంతో TTA వారి ఆర్ధిక కష్టాలు చూసి ఆ ప్రయాణ టిక్కెట్లు తామే భరిస్తామని భోరోసా ఇచ్చింది.కేవలం వెళ్లేందుకు మాత్రమే కాదు తిరుగు ప్రయాణానికి కూడా తామే టిక్కెట్లు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

కాగా అయితే ఎన్నో కలలతో చదువుకోవడానికి అమెరికా వచ్చిన వారి కలలు మధ్యలోనే ఆగిపోకూడదని భావించి మళ్ళీ తిరిగి వచ్చిన తరువాత వారి చదువులు కొనసాగించేలా అక్కడి అధికారులతో మాట్లాడారు.తాము ఎన్నో కష్టాలలో ఉన్న సమయంలో TTA చేసిన సాయం ఎప్పటికి మరిచిపోమని వారికి ఋణపడి ఉంటామాని విద్యార్ధులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube