ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలు ఒత్తుగా గడ్డం పెంచుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది.ముఖ్యంగా యువకులు వైవిధ్యమైన ఆకృతుల్లో గడ్డాన్ని పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
అయితే అందరికీ హెయిర్ గ్రోత్ ఒకేలా ఉండదు.కొందరికి గడ్డం ఇట్టే ఒత్తుగా పెరిగి పోతుంది.
కానీ, కొందరికి ఎన్ని చేసినా పెరగనే పెరగదు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ప్రయత్నిస్తే గనుక.
సులభంగా ఒత్తైన గడ్డాన్ని పొందొచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల నువ్వుల నూనెను తీసుకుని లైట్‌గా హిట్‌గా చేయాలి.ఇప్పుడు ఈ నూనెలో రెండు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్‌ను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని గడ్డం భాగంలో అప్డై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి.ఉదయాన్నే వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే ఒక టమాటా తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక స్పూన్ నల్ల జీలకర్ర పొడి, ఒక స్పూన్ కలబంద జెల్ వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గడ్డం భాగంలో పట్టించి.గంట లేదా రెండు గంటల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.ఇలా చేసినా కూడా గడ్డం పెరుగుతుంది.
ఇక బౌల్ తీసుకుని అందులో ఒక ఫుల్ ఎగ్, ఒక స్పూన్ ఆముదం, అర స్పూన్ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గడ్డం భాగంలో అప్లై చేసి.అర గంట అనంతరం వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
వారానికి ఒక సారి ఇలా చేయడం వల్ల సైతం గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.